బ్యాంకాక్‌లోనూ షూటింగ్ జరుపుకోనున్న ‘మహేష్ 23’!
Published on Jan 23, 2017 8:49 am IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్‌ ప్రస్తుతం హైద్రాబాద్‍లో జరుగుతోంది. ఈనెలాఖర్లో పూర్తి కానున్న ఈ షెడ్యూల్ తర్వాత టీమ్ పూణే, ముంబైలలో మరో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. పూణే షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఇదివరకే తెలిపిన టీమ్, తాజాగా బ్యాంకాక్‌లోనూ ఓ చిన్న షెడ్యూల్ ఉంటుందని స్పష్టం చేసింది.

బ్యాంకాక్‌లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖర్లో విదేశాల్లో పాటల చిత్రీకరణ జరగనుంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖర్లో ఫస్ట్‌లుక్, టైటిల్ విడుదల కానున్నాయి.

 
Like us on Facebook