ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్లపై మహేష్ ఫైట్స్..!

16th, October 2016 - 12:57:34 PM

mahesh23
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తన కొత్త సినిమాను శరవేగంగా పూర్తి చేస్తోన్న విషయం తెలిసిందే. ఈవారమే హైద్రాబాద్‌లో ఓ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టిన టీమ్, ఈ షెడ్యూల్‌లో భాగంగా పలు యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో, రోడ్లపై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. కార్ డ్రైవ్ చేస్తూ, జేసీబీ డ్రైవ్ చేస్తూ సాగే సన్నివేశాలతో షూటింగ్ ప్రాంతానికి విచ్చేసిన అభిమానులకు మహేష్ ఉత్సాహానిచ్చారు.

ఇండియన్ సినిమాలో కమర్షియల్ దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న మురుగదాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని భావిస్తోన్న టీమ్, ఇప్పటికే అన్ని భాషలకూ ఒకే టైటిల్ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సోషల్ డ్రామా హైద్రాబాద్ షెడ్యూల్ తర్వాత అహ్మదాబాద్‌లో త్వరలోనే మరో షెడ్యూల్ మొదలుపెట్టనుంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు.