మహేష్ 24 మొదలయ్యేది ఎప్పుడంటే ?

25th, April 2017 - 06:28:12 PM


సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాలసేవల హిట్ కాంబినేషనలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే ఫిక్సయిన ఈ ప్రాజెక్ట్ కోసం కొరటాల శివ ఇప్పటికే పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని మహేష్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కానిచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ – మురుగదాస్ ల చిత్రం మే 18 రెగ్యులర్ షూట్ కు వెళుతుందని అంటున్నారు.

మొదటగా ముందుగానే షూట్ ప్రారంబించాలని అనుకున్నా కూడా మహేష్ – మురుగదాస్ ల ‘స్పైడర్’ రిలీజ్ ఆలస్యం కావడంతో కొరటాల ప్రాజెక్ట్ కూడా కాస్త వెనుకబడింది. మే 18 న మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్ మే 28 వరకు జరుగుతుందట. అలాగే 2018 చివరి కల్లా సినిమాను రిలీజ్ చేయొచ్చని కూడా అంటున్నారు. ఇకపోతే బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటించనుంది.