నెవర్ బిఫోర్ గా మహేష్ 28 లో తన రోల్..!

నెవర్ బిఫోర్ గా మహేష్ 28 లో తన రోల్..!

Published on Oct 2, 2022 7:01 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో భారీ స్థాయి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. మరి ఇదిలా ఉండగా మహేష్ రోల్ సహా సినిమాపై అయితే యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చేశారు.

ఈ చిత్రం డెఫినెట్ గా ఈ కాంబోపై ఉన్న అంచనాలు రీచ్ అయ్యేలా ఉంటుంది అని అలాగే అంతకు మించే ఉంటుంది తప్ప ఎక్కడా తగ్గదని అలాగే మహేష్ గారి రోల్ అయితే నెవర్ బిఫోర్ లెవెల్ లో కనిపిస్తారని తెలిపారు. అంతేకాకుండా సినిమాలో సాలిడ్ ఆల్బమ్ కూడా ఉందని క్లారిటీ ఇచ్చారు. దీనితో అయితే ఇప్పుడు ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు