‘ఖైదీ నెం 150’ సినిమాని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో చెప్పిన మహేష్ !

14th, April 2017 - 09:00:03 AM


మహేష్ బాబు, మురుగదాస్ కలయికలో వస్తున్న ‘స్పైడర్’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మొన్న సాయంత్రం విడుదలై హంగామా సృష్టించింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలోనే జరుగతుండటంతో మహేష్ మహేష్ అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంగా తమిళ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అందులో ముఖ్యమైనది ఇటీవలే చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెం 150’ చిత్ర విశేషం.

ఈ సినిమా గురించి ప్రిన్స్ మాట్లాడుతూ మొదట ఈ రీమేక్ ప్రపోజల్ తన వద్దకే వచ్చిందని, కానీ రీమేక్ ల పై తనకు నమ్మకం లేదని, ఒకసారి చేసిన సినిమాని మళ్ళీ చేయాలంటే ఉత్సాహం ఉండదని, సెట్ కు వెళితే ఏదైనా కొత్తగా చేయాలని అన్నారు. అప్పటికీ అది దర్శకుడి సినిమా కాబట్టి మురుగదాస్ డైరెక్ట్ చేస్తే చేస్తానని చెప్పాను. కానీ అప్పుడు మురుగదాస్ హిందీలో బిజీగా ఉండటం వలన కుదరలేదని అన్నారు. అలాగే తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీ లతో తన స్నేహ బంధాన్ని గురించి కూడా ప్రస్తావించారు.