అవార్డుల స్వీప్ లో మహేష్, బన్నీల చిత్రాలు.!

Published on Sep 18, 2021 9:01 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు ఇద్దరూ తమ తమ భారీ చిత్రాల షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వీటి కన్నా ముందు గత ఏడాది ఎప్పుడు లేని బాక్సాఫీస్ యుద్ధం వీరి సినిమాల మధ్య నడవగా ఇద్దరూ కూడా బాక్సాఫీస్ విన్నర్స్ గానే నిలిచారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి పేర్లు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా విస్తరిస్తున్నాయి.

ఈ ఇద్దరు హీరోలు నటించిన గత చిత్రాల్లో మహేష్ నటించిన “మహర్షి” సినిమాకి 2019కి గాను సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు గా మహేష్, సినిమాగా మహర్షి, దర్శకునిగా వంశీ పైడిపల్లి, నిర్మాతగా దిల్ రాజు లకి గాను ఈ సినిమాకి వరుస అవార్డులు వరించగా ఆ తర్వాత ఏడాదికి గాను అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాకి బెస్ట్ నటుడు, బెస్ట్ సినిమా, బెస్ట్ దర్శకునిగా త్రివిక్రమ్, హీరోయిన్ గా పూజా హెగ్డే కి అలాగే సంగీతంలో థమన్ కి పలు అవార్డులు వరించాయి. దీనితో ఈ రెండు సినిమాలు కూడా రెండు ఏడాదులకి అవార్డులను స్వీప్ చేసేశాయి అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :