మరింత కష్టకాలంలో మహేష్, తన అభిమానులు.!

మరింత కష్టకాలంలో మహేష్, తన అభిమానులు.!

Published on Nov 15, 2022 8:00 AM IST

ఈ ఏడాది టాలీవుడ్ లో ఊహించని పెను విషాదాలు వరుసగా చోటు చేసుకుంటూ ఉండడం చాలా విచారకరం. గత కొన్నాళ్ల క్రితమే దిగ్గజ నటులు కృష్ణం రాజు గారు ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ లాంటి దిగ్గజాలని కోల్పోవడం అనేది ఓ తీరని విషాదం. అయితే ఇక్కడ సూపర్ స్టార్ వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాత్రం మరింత కష్టకాలం అని ఇది అని చెప్పాలి.

గత కొన్ని వారాల కితమే మహేష్ మాతృమూర్తి ఇప్పుడు వారి తండ్రిని కోల్పోవడం అనేది గుండె ముక్కలయ్యే పరిస్థితి. దీనితో మహేష్ పరిస్థితి ఆలోచిస్తేనే అభిమానులు మాత్రమే కాకుండా ఎవరికైనా కూడా హృదయం బరువెక్కిపోతుంది. దీనితో మహేష్ కి ఆ భగవంతుడు మరింత బలాన్ని ప్రసాదించాలని అంతా కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ వరుస విషాదాలతో మాత్రం మహేష్ మరియు తన అభిమానులు ఇప్పుడు చాలా బాధని ఎదుర్కొంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు