ఒకే ఫ్రేమ్ లో మహేష్, థలపతి విజయ్..వేదిక ఇదే.?

Published on Sep 29, 2021 11:00 am IST

మన సౌత్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఇళయ థలపతి విజయ్ ల సినిమాల పెర్ఫామెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో మనకి తెలిసిందే. మరి అలాంటిది ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమా చేస్తారు అంటే దాని ఇంపాక్ట్ కూడా ఇంకో లెవెల్లో ఉంటుంది. అయితే ఇద్దరు కలిపి ఒక సినిమాలో కనిపించడం ఏమో కానీ అంతకు ముందే ఒక ఫ్రేమ్ లో కనిపించే అవకాశం ఉన్నట్టుగా బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

తాజాగా థలపతి విజయ్ తన కొత్త సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో కన్ఫర్మ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ దర్శకునికి మహేష్ కి కూడా మంచి అనుబంధం ఉంది. పైగా మహేష్ విజయ్ లకి కూడా మధ్య ట్విట్టర్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమయంలో మంచి కన్వర్జేషన్ మనం చూసాము. సో మహేష్ వంశీ, విజయ్ ల సినిమా ఓపెనింగ్ కు రానున్నట్టుగా విజయ్ అభిమాన వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది ఎపుడు సాధ్యపడుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :