మహేష్ తో ముందుగా సాంగ్ ప్లాన్ చేస్తోన్నాడట !

Published on Sep 13, 2021 5:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ చేయబోతున్న క్రేజీ సినిమాని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా మహేష్ పై ఒక సోలో సాంగ్ ను షూట్ చేయడానికి త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నాడు. దాదాపు పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

అన్నిటికీ మించి ‘అరవింద సమేత, ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్, మహేష్ తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై బారీ ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :