అల్లరి నరేష్ కోసం సూపర్ స్టార్ !

naresh mahesh babu

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన 25వ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు మహేష్ ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు. నరేష్ గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సుడిగాడు’ సూపర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పేరు ‘సిల్లీఫెలోస్’.

ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ చీఫ్ గెస్ట్ గా రానున్నారట. తన సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్న అల్లరి నరేష్ కోసం మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారట. మహేష్ రాక నరేష్ సినిమాకు ఎంతో కొంత లాభించే అవకాశం లేకపోలేదు. ఇందులో నరేష్ తో పాటు సునీల్ కూడా నటిస్తున్నాడు. ఆయనకు కూడ ఈ విజయం చాలా కీలకం

Exit mobile version