ఫ్యామిలీస్ తప్పక చూడాల్సిన చిత్రం “రైటర్ పద్మభూషణ్” – సూపర్ స్టార్ మహేష్!

Published on Feb 6, 2023 1:00 pm IST

రైటర్ పద్మభూషణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సుహాస్ నటించిన ఈ చిత్రం చాలా మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం ను చూశారు. చిత్రం విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా సినిమా ఎలా ఉందో వెల్లడించారు

రైటర్ పద్మభూషణ్‌ని చూసి ఆనందించాను. హృదయపూర్వక చిత్రం, ముఖ్యంగా క్లైమాక్స్. ఫ్యామిలీస్ తప్పక చూడవలసిన చిత్రం. చిత్రంలో సుహాస్ నటన నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. చిత్ర యూనిట్ తో ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు మహేష్ బాబు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. స్టార్ యాక్టర్ నుండి ప్రశంసలు అందుకోవడంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గౌరీ ప్రియా రెడ్డి తదితరులు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామాకి షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :