త్రివిక్రమ్ సినిమాకి మహేష్ కేటాయించిన డేట్స్ ఇవే!

Published on Jul 11, 2022 12:01 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా డిటైల్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇప్పటికే ఈ సినిమా షూట్ ఆగస్టు రెండో వారంలో స్టాట్ కాబోతుందని మేకర్స్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. కాగా తాజా అప్‌ డేట్ ప్రకారం, మహేష్ ఈ చిత్రానికి 100 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఇక ఈ సినిమా పూర్తి కాగానే జనవరి నుంచి రాజమౌళితో చేయబోయే చిత్రానికి మహేష్ బాబు పూర్తిగా అందుబాటులో ఉంటాడు.

సంబంధిత సమాచారం :