బ్యూటిఫుల్ మూమెంట్స్ : తమ పెళ్లి రోజున మహేష్, నమ్రతల స్పెషల్ పోస్ట్స్!

Published on Feb 10, 2022 3:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని మోస్ట్ బ్యూటిఫుల్ పెళ్లి జంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు తన భార్య నమ్రత ఘట్టమనేని ల జంట కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి చేసే సేవా కార్యక్రమాలతో అయితే ఒక ఆదర్శవంతులైన జంటగా కొనియాడబడతారు. అయితే వీరిద్దరూ కూడా తమ సినిమా ఫీల్డ్ నుంచే వివాహం చేసుకొని ఒకటి అయ్యారన్న సంగతి అందరికీ తెలిసిందే.

మరి అలా ఒక్కటైన రోజు ఈరోజుకి 17 ఏళ్ళు పూర్తి చేస్తుంది. అంటే వీరిద్దరి పెళ్ళై 17 ఏళ్ళు గడిచిపోయాయి. మరి ఈ సందర్భంగా ఈ ఇద్దరూ తమ సోషల్ మీడియాలో కొన్ని బ్యూటిఫుల్ పోస్టులు పెట్టుకున్నారు. ముందుగా మహేష్ తాను తన భార్య నమ్రత మరియు పిల్లలు గౌతమ్, సితార లతో కలిపి ఉన్న ఒక ఫోటో ని షేర్ చేసి ఈజీగా 17 ఏళ్ళు గడిచిపోయినట్టు ఉన్నాయి..

హ్యాపీ ఆనివెర్సరీ నమ్రత, ఇలా ఇంకా ఎన్నో ఏళ్ళు మనం గడుపుకోవాలి అని ఎంతో ప్రేమతో తన భార్యపై ఉన్న ఇష్టాన్ని వ్యక్త పరచగా నమ్రత అయితే తమ కెరీర్ లో స్టార్టింగ్ నుంచి పెళ్లి నాటి ఫొటోలతో సహా ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు తాము గడిపిన ఎన్నో మధుర జ్ఞ్యాపకాలను నెమరు వేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ని పట్టారు.

మా పెళ్లి రెసిపీ అంటూ ఒక క్యూట్ వీడియోని పెట్టారు. తమ లైఫ్ లో ఇప్పటివరకు అన్ని ఎమోషన్స్ తో ఎంతో ఆనందంగా గడిచింది అని లవ్ యూ అంటూ తమ 17 ఏళ్ల వైవాహిక జీవితం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇలా ఈ ఇద్దరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం మరింత అన్యోన్యంగా అనిపిస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :