కొరటాల శివను మెచ్చుకున్న మహేష్ బాబు

Mahesh-Babu-Koratala-Shiva
దర్శకుడిగా కొరటాల శివ స్థాయి ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మరింతగా పెరిగింది. ప్రస్తుతం టాలీవుడు లో ఆయనో టాప్ అండ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. అందుకే ఆయన తరువాతి చిత్రాలు కూడా మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతోనే ఉంటున్నాయి. ఇకపోతే స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా ‘జనతా గ్యారేజ్’ చిత్రం చూసి సినిమాను డీల్ చేసిన విధానం బాగుందని కొరటాల శివకు కితాబిచ్చాడట.

గతంలో కూడా మహేష్ తాను కొరటాల శివ డైరెక్షన్లో చేసిన ‘శ్రీమంతుడు’ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చి మరీ అభినందించిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి నెక్స్ట్ చిత్రం ప్రస్తుతం మహేష్ బాబు, మురుగదాస్ తో చేస్తున్న చిత్రం పూర్తవగానే మొదలవుతుంది.