తన తండికి మహేష్ “ఫాథర్స్ డే” బ్యూటిఫుల్ విషెష్.!

Published on Jun 19, 2022 12:00 pm IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మొట్ట మొదటి సూపర్ స్టార్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో కృష్ణ తనయుడిగా సూపర్ స్టార్డం ని ఎక్కడా తగ్గించకుండా తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర బిగ్గెస్ట్ స్టార్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కొనసాగుతున్నారు. మరి మహేష్ కి తన తల్లిదండ్రులు అంటే ఎంతటి ప్రేమ గౌరవం ఉన్నాయో ఎన్నో మార్లు తాను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి.

మరి ఈరోజు వరల్డ్ ఫాథర్స్ డే సందర్భంగా తన తండ్రి కృష్ణ పై మహేష్ ఒక బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ పోస్ట్ ని పెట్టడం వైరల్ గా మారింది. “ఒక తండ్రిగా ఎలా ఉండాలో మీరే ఒక ఉదాహరణగా నిలిచి నాకు స్ఫూర్తిని ఇచ్చారు నాన్న, మీరు అనేవారు లేకపోతె నేను లేను. హ్యాపీ ఫాథర్స్ డే నాన్న!” అంటూ మహేష్ తన ప్రేమను వ్యక్తపరిచారు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ తన సర్కారు వారి పాట హిట్ తర్వాత వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :