మాటల మాంత్రికుడికి సూపర్ స్టార్ బర్త్ డే విషెస్

మాటల మాంత్రికుడికి సూపర్ స్టార్ బర్త్ డే విషెస్

Published on Nov 7, 2022 3:36 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మహేష్ పక్కా మాస్ రోల్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ త్వరలో రెండవ షెడ్యూల్ కి సిద్ధం అవుతోంది. ఇక గతంలో త్రివిక్రమ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సూపర్ డూపర్ హిట్ కొట్టగా అనంతరం చేసిన ఖలేజా పెద్దగా ఆడలేదు.

అయినప్పటికీ సూపర్ ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ పై మంచి హైప్ ఉంది. తప్పకుండా వీరిద్దరూ కలిసి ప్రస్తుతం చేస్తున్న SSMB28 మూవీ పెద్ద సక్సెస్ కొడుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే సినిమాల పరంగానే కాక వ్యక్తిగతంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ మంచి స్నేహితులు కూడా. ఇక తన మూవీ డైరెక్టర్, అలానే ఫ్రెండ్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటుండడంతో కొద్దిసేపటి క్రితం స్పెషల్ గా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు మహేష్ బాబు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రివిక్రమ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, మీరు ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యంతో వర్ధిల్లాలి అంటూ మహేష్ బాబు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు