“లవ్ స్టోరీ” సినిమాపై మహేశ్ బాబు ప్రశంసలు..!

Published on Sep 26, 2021 12:55 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లవ్‌స్టోరీ సినిమాని వీక్షించి స్పందించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు గుప్పించాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని అన్నారు.

ఇక నటుడిగా నాగ చైతన్య మరింత ఎదిగిపోయాడని, అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు. సాయిపల్లవి నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి, తెరపై ఆమెలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని ఒక కలలా ఆమె కదులుతుందని అన్నారు. ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమని, రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నానని ఖచ్చితంగా రెహమాన్ సర్ గర్వపడతారని అన్నారు. నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు గార్లకి అభినందనలు తెలియచేశారు.

సంబంధిత సమాచారం :