క్రేజీ న్యూస్ : మహా శివరాత్రి స్పెషల్ షో టికెట్ సేల్స్ లో మహేష్ బాబు ‘దూకుడు’ రికార్డు

Published on Feb 17, 2023 12:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ 2011 లో విడుదలై అతి పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, బ్రహ్మానందం, సొను సూద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు కీలక పాత్రలు చేసిన దూకుడు మూవీ అప్పట్లో రిలీజ్ అయిన ఎన్నో ఏరియాల్లో భారీ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.

అయితే విషయం ఏమిటంటే, మరొక రెండు రోజుల్లో మహాశివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పలువురు స్టార్ హీరోలు నటించిన సినిమాల స్పెషల్ షోస్ ని ప్రదర్శించనున్నారు. కాగా వీటిలో సూపర్ స్టార్ మహేష్ దూకుడు మూవీని సుదర్శన్ 335 ఎం ఎం లో స్పెషల్ షో ప్రదర్శించనుండగా ఆ షో యొక్క టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేసిన కేవలం కొన్ని క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ విధంగా మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ మరొక్కసారి దూకుడు తో తన ప్రభంజనాన్ని సృష్టించారు అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :