తన మాతృమూర్తికి మహేష్ ఎమోషనల్ బర్త్ డే విషెష్.!

Published on Apr 20, 2022 12:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే మోస్ట్ అవైటెడ్ సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మహేష్ తాజా గానే పూర్తి చేసేసాడు. మరి ఈరోజు తన మాతృమూర్తి అయినటువంటి ఇందిరా దేవి జన్మదినం సందర్భంగా మహేష్ తాను సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ బర్త్ డే విషెష్ ని తెలియజేసాడు.

“హ్యాపీ బర్త్ డే అమ్మ మీరు నాకు ఎల్లప్పుడూ ఆశీర్వాదంగా ఉన్నందుకు ధన్యవాదాలు.. ఒక్క రోజు చాలదు మీ మీద నా ప్రేమ చిరకాలం ఉంటుంది” అని తాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. దీనితో మహేష్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోకి జన్మనిచ్చిన మాతృమూర్తికి తాము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :