బాలయ్య షోలో కదిలిస్తున్న మహేష్ ఎమోషనల్ కామెంట్స్.!

Published on Jan 22, 2022 8:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా పలు సాలిడ్ సినిమాలు చేస్తుండటమే కాకుండా ఫస్ట్ టైం ఓటిటి లోకి ఒక హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ షాట్ లోనే సూపర్ హిట్ అందుకున్నారు. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో “అన్ స్టాప్పబుల్” అనే టాక్ షో ని స్టార్ట్ చేసి సాలిడ్ రెస్పాన్స్ తో తీసుకెళ్లారు. మరి ఈ షో ఇప్పుడు చిట్ట చివరి ఎపిసోడ్ కి వచ్చేసింది.

అయితే ఈ ఎపిసోడ్ ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్లాన్ చేసి నిన్ననే దీని తాలూకా ఫస్ట్ ప్రోమోని రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్సు కూడా వస్తుంది. అయితే ఈ ప్రోమో లో చాలా అంశాలే హైలైట్ గా మహేష్ చేసిన కొన్ని కామెంట్స్ అయితే ఎమోషనల్ గా ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. మహేష్ ప్రస్తుతం వేలాదిమంది చిన్నారులకి గుండె ఆపరేషన్స్ చేయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే అందుకు గల బలమైన కారణం మహేష్ తెలిపారు. తన కొడుకు గౌతమ్ 6 వారాల ముందే పుట్టాడని అప్పుడు కేవలం తన అర చెయ్యి అంతే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆరడుగులు ఉన్నాడు. మాకు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయించుకోగలిగాం కానీ డబ్బులు లేని వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచించి ఇదంతా స్టార్ట్ చేసానని కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దీనితో ఈ కామెంట్స్ అసలు విషయం కోసం తెలియని చాలా మందిని కదిలిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :