కృష్ణ గారి మెమొరబుల్ ఫోటోతో మహేష్ ఎమోషనల్ పోస్ట్.!

Published on Nov 24, 2022 4:00 pm IST

గత కొన్ని రోజులు కితమే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ధృవ తార అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు స్వర్గస్థులు అయిన సంగతి తెలిసిందే. మరి ఈ విషాదంతో ఘట్టమనేని వారి ఇంట తీవ్ర విషాదం నెలకొనగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత దుఃఖం లోకి వెళ్లిపోయారు.

మరి ఓ కొడుకుగా అయితే సినీ ప్రస్థానంలో తెలుగు సినిమా వద్ద సూపర్ స్టార్ కి సిసలైన వారసునిగా తన సత్తా చాటాడు. ఇక ఇదిలా ఉండగా ఈరోజు సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా ద్వారా కృష్ణ గారి యంగ్ ఏజ్ లో ఉన్న ఓ మెమొరబుల్ ఫోటో ని షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ ని అయితే పోస్ట్ చేశారు.

“మీ ఇన్నాళ్ల జీవితం ఓ సంబరం అదే విధంగా మీ ముగింపు కూడా ఓ గొప్ప అంతిమ ప్రయాణం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా డేరింగ్ అండ్ డాషింగ్ గా గడిపారు. నా ఇన్ స్పిరేషన్, నా ధైర్యం మీరే, ఇప్పుడు నాలో నేను కొత్తగా ఉన్న నన్ను చూసుకుంటున్నాను మీరు లేకపోయినా సరే మీరు ఇచ్చిన కాంతి ఇంకా నాలో ప్రకాశిస్తుంది. మీ లెగసిని నేను ముందుకు తీసుకెళ్తాను. లవ్ యూ నాన్న. మై సూపర్ స్టార్” అంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపారు. దీనితో ఈ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :