ఈ రెండేళ్లలో నాకు బాగా దగ్గరైన వారు దూరమయ్యారు.. మహేశ్ బాబు ఎమోషనల్..!

Published on May 8, 2022 3:00 am IST


సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాస్తుంది. మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుక శనివారం నాడు ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా హీరో మహేశ్ బాబు మాట్లాడుతూ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్నందరిని కలిసి రెండేళ్లు పైనే అయ్యింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసిన పరశురామ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పటి వరకు నా ఫేవరేట్ క్యారెక్టర్స్ లో ఇది ఒకటి. ఈ సినిమాలో నన్ను పూర్తిగా మార్చేశారు. కొన్ని సీన్లు చేసేటప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చాయి. షూటింగ్స్ లో చాలా ఎంజాయ్ చేశాను. పరశురామ్ కథ చెప్పి ఇంటికెళ్లిపోయాక నాకు.. ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. మీరు ఇప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఎలా తీస్తానో మీరే చూడండి, ఇరగదీసేస్తాను అని మెసేజ్ పెట్టారు. ఈ సినిమా చూశాక నా అభిమానులకి, నాన్న గారి అభిమానులకి ఆయన ఫేవరేట్ డైరెక్టర్ అవుతారు. సర్కారు వారి పాట నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ అన్నాడు.

ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. హీరో, హీరోయిన్ ట్రాక్ నా ఫేవరెట్ ట్రాక్. దీని కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారు. కీర్తి సురేష్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెస్ చాలా కొత్తగా ఉంటాయి. గత రెండేళ్లలో ఎన్నిసార్లు డేట్లు అడిగినా తను కదనకుండా ఇచ్చింది. తనకు థ్యాంక్స్. ఇక నాకు, థమన్‌కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. కానీ నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. కళావతి ఎంత హిట్ అయ్యిందనేది అందరికీ తెలుసు. దానికి పూర్తి క్రెడిట్ థమన్‌కే అని అన్నాడు.

రామ్, లక్ష్మణ్ మాస్టర్లు హీరోను ఎంత బాగా చూసుకుంటారో, ఫైటర్లను కూడా అంతే బాగా చూసుకుంటారని, అందుకే వాళ్లు నంబర్ వన్ అయ్యారని అన్నాడు. శేఖర్ మాస్టర్‌కు కూడా థ్యాంక్స్. మైండ్ బ్లాక్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలుసు. ఈ సినిమాలో డ్యాన్స్‌లు దానికి మించి ఉంటాయి. ఈ సినిమాకు పనిచేసిన మిగతా టీం మొత్తానికి చాలా థ్యాంక్స్. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మాతలు నాకు బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు. ఈ రెండేళ్లలో చాలా మారాయి. నాకు బాగా దగ్గరైన వ్యక్తులను కోల్పోయాను. కానీ మీ అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ముందుకు వెళ్లిపోవడానికి. మే 12వ తేదీ మీకు అందరికీ నచ్చే సినిమా రాబోతుంది.’ అంటూ స్పీచ్‌ను ముగించారు.

సంబంధిత సమాచారం :