సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి ఘటనపై మహేశ్ బాబు ఎమోషనల్ ట్వీట్..!

Published on Sep 14, 2021 9:59 pm IST


నాలుగు రోజుల క్రితం వినాయక చవితి నాడు హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి చంపేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. గంటలు.. రోజులు గడిచినా చిన్నారిని చిదిమేసిన నింధితుడి ఆచూకీ పోలీసులకు ఇంకా లభించలేదు.

అయితే తాజాగా ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన ఘటన చూశాక మన సమాజం ఎంత నీచానికి దిగజారిందన్న దానిని గుర్తు చేస్తుందని, ఇలాంటి ఘటనల వలన ఆడపిల్లలు ఉన్న కుటుంబాలలో తమ పిల్లలు సురక్షితంగా ఉంటారా అన్న ప్రశ్న ఎల్లప్పుడూ వారిలో మెదలుతూ ఉంటుందని, చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేమని మహేశ్ ఎమోషనల్ అయ్యారు. నిందితుడిని త్వరగా పట్టుకుని తగిన చర్యలు తీసుకుని, చిన్నారికి మరియు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నట్టు మహేశ్ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :