బాలయ్యతో షో సూపర్ గా ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్.!

Published on Dec 5, 2021 10:05 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇదే క్రమంలో మహేష్ నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా మొట్ట మొదటి సారి ఓటిటి ప్లాట్ ఫామ్ “ఆహా” లో చేస్తున్న “అన్ స్టాప్పబుల్” షో లో పాల్గొననున్నట్టుగా గత కొన్ని రోజులు కితమే మేము తెలిపాము. దీనితో ఈ క్రేజీ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది.

నిన్న డిసెంబర్ 4న షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసుకోగా అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సాయంత్రం అన్ స్టాప్పబుల్ నందమూరి బాలకృష్ణ గారుతో షో ఎంజాయ్ ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేసానని తమ ఇద్దరి ఫోటోని కలిపి తన ఇన్స్టా స్టోరీ లో షేర్ చేశారు. దీనితో ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :