అన్ స్టాపబుల్: సీజన్ ను మహేష్ తో ముగించనున్న బాలయ్య!

Published on Dec 22, 2021 4:00 pm IST

ఎన్నో వెబ్ సిరీస్ లతో, కొత్త సినిమాలతో, సరికొత్త కార్యక్రమాల తో ఆహా వీడియో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డిజిటల్ వేదిక గా కుటుంబ సభ్యులకు ఆనందాన్ని అందిస్తుంది. అయితే బాలకృష్ణ మొదటి సారి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కి సీజన్ ముగియడానికి సిద్దం గా ఉంది.

అయితే చివరగా ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను తాజాగా ఆహా వీడియో సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. బాలయ్య బాబు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేదిక పై కలిసి ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ ఎపిసొడ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని ఆహా వీడియో తెలిపింది. ఏదేమైనా మహేష్ బాబు మరియు బాలయ్య అభిమానులకు ఇది కచ్చితంగా అధ్బుతమైన విషయమని చెప్పాలి.

సంబంధిత సమాచారం :