అన్‌స్టాపబుల్: మహేశ్ బాబు ఎపిసోడ్‌ ప్రీమియర్ తేది ఫిక్స్..!

అన్‌స్టాపబుల్: మహేశ్ బాబు ఎపిసోడ్‌ ప్రీమియర్ తేది ఫిక్స్..!

Published on Jan 20, 2022 10:38 PM IST

నందమూరి బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేస్తున్న సందడి ప్రేక్షకులకు ఫుల్ టూ ఎంటర్‌టైన్‌ని ఇస్తుంది. అయితే మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ సీజన్‌ని ముగిస్తున్నామని ఇప్పటికే ఆహా అనౌన్స్ చేయగా, ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా మహేష్ బాబు ఎపిసోడ్ ప్రీమియర్ తేదిని ఆహా ప్రకటించింది. ఫిబ్రవరి 4, 2022న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలిపింది. అంతేకాకుండా ఈ స్పెషల్ ఎపిసోడ్‌తో సీజన్ 1 ముగుస్తుందని కూడా మేకర్స్ మరోసారి ధృవీకరించారు. ఇక త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు