మహేష్ బాబు ఫ్యామిలీ లండన్ మెమోరీస్ చూసారా ?

మహేష్ బాబు ఫ్యామిలీ లండన్ మెమోరీస్ చూసారా ?

Published on Nov 4, 2022 12:05 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న తన తాజా SSMB28 సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసారు. అనంతరం కొద్దిరోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి లండన్ కి వెకేషన్ కి వెళ్లారు. ఇక మూడు రోజుల క్రితం వెకేషన్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు కుటుంబం ఇండియాకి తిరిగి చేరుకుంది. అలానే అతి త్వరలో త్రివిక్రమ్ మూవీ సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతోంది, మరోవైపు దాని కోసం సిద్ధం అవుతున్నారు మహేష్.

అయితే విషయం ఏమిటంటే, మహేష్ తో పాటు ఆయన సతీమణి నమ్రత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తమ పర్సనల్, ఫ్యామిలీ లైఫ్ గురించిన పలు సంగతులు ఫ్యాన్స్, ఆడియన్స్ తో పంచుకుంటూ ఉంటారు. కాగా లేటెస్ట్ గా వారి ఫామిలీ లండన్ ట్రిప్ కి సంబందించిన పలు మెమొరబుల్ ఫొటోస్ కలిపి ఒక పిక్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసారు నమ్రత. కాగా ఆ కంబైన్డ్ పిక్స్ లో మహేష్, నమ్రత, గౌతమ్, సితార తో పాటు వారి ఇతర ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ ని కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ పిక్ ని పలువురు సూపర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లైక్, షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు