టాలీవుడ్ యంగ్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ దసరా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ స్థాయిలో రూపొందిన ఈ పాన్ ఇండియన్ మూవీ నిన్న శ్రీరామనవమి సందర్భంగా పలు భాషల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి తొలి రోజు తొలి ఆట నుండి సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మాస్ రస్టిక్ ఎంటర్టైనర్ లో నాని, కీర్తి సురేష్ సూపర్ యాక్టింగ్ తో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ప్రతిభ పై అందరి నుండి మంచి పేరు లభిస్తోది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈమూవీ కి సత్యన్ సూర్యన్ కెమెరా మ్యాన్ గా వర్క్ చేశారు.
ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీని ప్రత్యేకంగా వీక్షించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దసరా టీమ్ పై ప్రసంశలు కురిపిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ పెట్టారు. దసరా మూవీ చూసాను స్టన్నింగ్ గా ఉంది, నిజంగా అందరూ గర్వపడాల్సిన సినిమా అంటూ సూపర్ స్టార్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తో పాటు శ్రీలక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ టీమ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసింది.
So so proud of #Dasara!! Stunning cinema! ????????@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP
— Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023