ఏ ఇండియన్ హీరోకి లేని సోషల్ మీడియా రికార్డ్ ఒక్క మహేష్ కే.!

Published on Jan 2, 2022 9:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మరి మహేష్ కి ఆఫ్ లైన్ లో ఎలా అయితే మంచి క్రేజ్ ఉందో అలానే సోషల్ మీడియాలో కూడా అంతే క్రేజ్ తనకి సొంతం. అయితే తన ట్విట్టర్ అకౌంట్ నుంచి మహేష్ ఏ ఇండియన్ హీరోకి కూడా దక్కని సాలిడ్ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

తన ట్విట్టర్ నుంచి ఒక్క పోస్ట్ కి లక్ష కి పైగా లైక్స్ ఉన్న పోస్టులు 30కి పైగా ఉన్న ఏకైక హీరోగా మహేష్ రికార్డు సెట్ చేసాడు. అంతే కాకుండా ఈ కొత్త సంవత్సరంకి వేసిన ఫస్ట్ ట్వీట్ కి లక్ష లైక్స్ ని అందుకోవడం మరో విశేషం. దీనిని బట్టి ట్విట్టర్ లో మహేష్ క్రేజ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మహేష్ కాస్త రెస్ట్ లోనే ఉన్నారు. కొన్ని రోజులు తర్వాత మళ్ళీ తన సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు.

సంబంధిత సమాచారం :