“పుష్ప”రాజ్ అండ్ టీమ్‌పై మహేశ్ బాబు ప్రశంసలు..!

Published on Jan 5, 2022 12:34 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం “పుష్ప”. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ మరియు పుష్ప చిత్ర బృందంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.

పుష్ప పాత్రలో అల్లు అర్జున్ చాలా అద్భుతంగా నటించాడని, సుకుమార్ తన సినిమాని పల్లెటూరి వాతావరణంలోనే చూపిస్తూ నిజాయితీతో, క్లాస్ వేరుగా ఉండేలా మరోసారి రుజువు చేశాడని, ఇక దేవిశ్రీ ప్రసాద్ గురుంచి నేను ఏమి చెప్పగలనని.. నువ్వు నిజంగా రాక్ స్టార్ అని కొనియాడాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు మొత్తం టీమ్‌కి అభినందనలు తెలుపుతున్నానని, మీ గురించి నిజంగా గర్వంగా ఉంది అబ్బాయిలు అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :