మహేష్ మరో మహత్తర కార్యం..ఒక్క రోజులో 30 ప్రాణాలకు ఊపిరి.!

Published on Apr 8, 2022 7:54 am IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన “ఖలేజా” సినిమాలో “దైవం మానుష రూపేణా” అనే పదానికి సార్ధకత చూపిస్తూ నిజ జీవితంలో కూడా మహేష్ ఆపదలో ఉన్నవారి పట్ల దేవునిగా నిలుస్తున్నాడని చెప్పాలి. ఇది వరకే ఎన్నో వేల ప్రాణాలను తన ఆర్ధిక వనరులతో కాపాడిన మహేష్ తర్వాత తన ఫౌండేషన్ తో తన సహాయాన్ని మరింత విస్తరింపజేశారు.

అయితే నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరో మహత్తర కార్యానికి మహేష్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేక రోజున ఏకంగా 30 మంది చిన్నారుల గుండెలకి ఊపిరి పోసి వారు కుటుంబాల చిరు నవ్వుకి కారణం అయ్యారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. దీనితో ఆమె ఏపీ గవర్నర్ కి మరియు ఆంధ్ర రాష్ట్ర ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసారు. దీనితో మహేష్ అభిమానులు మారోమారు తమ అభిమాన హీరో పట్ల గర్వం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :