క్రేజీ బజ్ : పవన్ కు జోడీగా మహేష్ హీరోయిన్ ?

Published on Feb 28, 2023 12:57 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పదకొండేళ్ల క్రితం మాస్ కమర్షియల్ సినిమాల దర్శకడు హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీ ఎంతో పెద్ద విజయం అందుకున్న సంగతి తెలిసిందే. స్వతహాగా పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ తీసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్ని కూడా ఎప్పటికీ ఫ్యాన్స్ మదిలో నిలిచిపోతాయి. ఇక మళ్ళి అతి త్వరలో తన అభిమాన పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నారు హరీష్ శంకర్. ఇటీవల అఫీషియల్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ మార్చి చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మితం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక క్రేజ్ న్యూస్ టాలీవుడ్ లో బజ్ గా ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా యువ నటి శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నారు అనే వార్తలు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న నేపథ్యంలో సడన్ గా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఇక ప్రస్తుతం రామ్ తో ఒక సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల మూవీలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి ప్రస్తుతం బజ్ గా ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఆ మూవీ యూనిట్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సిందే.

సంబంధిత సమాచారం :