రాజమౌళి తో సినిమా ప్రెజర్ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on May 22, 2022 2:02 pm IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రం “సర్కారు వారి పాట” సూపర్ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తూ తన ఫ్యామిలీని తీసుకొని ఈరోజే వెకేషన్ కి పయనం అయ్యాడు. అయితే దీని తర్వాత మహేష్ నుంచి ఒక సాలిడ్ లైనప్ రెడీగా కూడా ఉంది. వాటిలో దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా నెక్స్ట్ స్టార్ట్ కానుండగా దాని తర్వాత మహేష్ అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాజమౌళితో ఉంది.

అయితే లేటెస్ట్ గా మహేష్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే రాజమౌళి సినిమా విషయంలో ఎలాంటి ప్రెజర్ లేదని కానీ తన వర్క్ పట్ల చాలా ఎగ్జైటింగ్ గా తాను ఉన్నానని మహేష్ తెలిపాడు. మేము ఎప్పుడు నుంచో ఓ సినిమా అనుకుంటున్నాం ఫైనల్ గా అది ఇప్పుడు అవుతుంది. అందుకు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని మహేష్ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :