“మేజర్” విషయంలో అల్లు అర్జున్ కి మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ రిప్లై..!

Published on Jun 5, 2022 5:13 pm IST


తాజాగా పాన్ ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యి ఆడియెన్స్ ని ఎంత గానో కదిలించిన చిత్రం “మేజర్”. టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శశికిరణ్ తెరకెక్కించాడు. మంచి రెస్పాన్స్ తో పాటుగా మంచి వసూళ్లను కూడా రాబడుతున్న ఈ సినిమాపై అనేక మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించాడు.

ఈ చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పి ఈ సినిమా నిర్మాత అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి అయితే ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపాడు. మరి దీనిపై ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ స్పందిస్తూ బన్నీ కి రిప్లై ఇవ్వడం ఆసక్తిగా మారింది. అల్లు అర్జున్ కి థాంక్స్ చెప్తూ నీ మాటలు ఈ యంగ్ టీం కి చాలా ఉత్సాహాన్ని అందిస్తాయని నీకు ఈ సినిమా నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని మహేష్ రిప్లై ఇచ్చారు. దీనితో ఈ రిప్లై తో మహేష్ మరియు అల్లు అర్జున్ అభిమానులు మరలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :