రాజమౌళి సినిమాకి మహేష్ డైనమిక్ లుక్ వైరల్.!

రాజమౌళి సినిమాకి మహేష్ డైనమిక్ లుక్ వైరల్.!

Published on Jul 7, 2024 5:00 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా సహా వరల్డ్ మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కోసమే అని చెప్పాలి. మరి ఈ భారీ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా (SSMB 29) రాబోతుండగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందు మేకర్స్ కొంచెం గ్యాప్ తీసుకొని అంతా సెట్ చేస్తుండగా ఈలోపు మహేష్ బాబు కూడా కొత్త లుక్ లోకి మారడం స్టార్ట్ చేసాడు. అయితే ఈ సినిమా కోసం తాను ప్రిపేర్ చేస్తున్న లేటెస్ట్ లుక్స్ కి మహేష్ అభిమానులు అయితే సంబరపడిపోతున్నారు.

గడ్డం పెంచుతూ లాంగ్ హెయిర్ లో ఒక డైనమిక్ లుక్ తో అయితే మహేష్ కనిపిస్తుండగా ఇది ఇప్పుడు ఫ్యాన్స్ లో వెంటనే వైరల్ గా మారిపోయింది. మరి మొత్తానికి అయితే ఈ భారీ కాంబినేషన్ నుంచి మాసివ్ ట్రీట్ లోడింగ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు