‘గీత గోవిందం’తో ఎట్టకేలకు పరుశురామ్ తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల రూపాయల భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పటికే పరుశురామ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
కాగా పరుశు రామ్ మంచి కామెడీ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్ ను తయారు చేస్తున్నారట. ఇటీవలే మహేశ్ కి ఆ సబ్జెక్ట్ కు సంబంధించి లైన్ ని కూడా చెప్పాడట. అయితే మహేశ్ ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు సమాచారం. మరి ఫుల్ స్క్రిప్ట్ తో పరుశు రామ్ మహేశ్ ను ఒప్పిస్తాడో లేదో చూడాలి.
