పెద కాపు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన యంగ్ హీరో విరాట్ కర్ణ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రమే “నాగబంధం” (Nagabandham). భారీ సినిమాల నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. శివరాత్రి సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియాలో ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ బాగుందన్న మహేశ్.. సినిమాని చూసేందుకు ఎదురుచూస్తున్నా అని తన పోస్ట్ లో తెలిపారు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. పురాతనమైన రహస్యాలు, నాగబంధం (Nagabandham) సాంప్రదాయంతో ముడిపడిన కథతో సాగిన ఈ టీజర్ లో షాట్స్ మేకింగ్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ వేసవిలో విడుదల కానుంది. అన్నట్టు పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో ఈ సినిమా ఉండబోతుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
