ఫిబ్రవరి నుండి మహేష్ బాబు కొత్త సినిమా !

మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నుండి ఈ సినిమా మొదలుకానుంది.

ఊపిరి సినిమా తరువాత వంశి పైడిపల్లి చేస్తోన్న సినిమా అవ్వడం విశేషం. దిల్ రాజు, అశ్వినిదట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. మహేష్ బాబు కెరీర్ లో ఇది 25 వ సినిమా అవ్వడం విశేషం. నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్ర విశేషాలు మీడియాతో పంచుకోనున్నారు యూనిట్ సభ్యులు.