తన మల్టీస్టారర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చిన మహేష్.!

Published on May 22, 2022 9:50 pm IST

ప్రస్తుతం మన తెలుగు సినిమా నుంచి అనేక మల్టీ స్టారర్ చిత్రాలు పడుతున్నాయి. వాటిలో ఆల్రెడీ కొన్ని రిలీజ్ అయ్యి భారీ హిట్స్ కూడా కాగా రానున్న రోజుల్లో మరికొన్ని సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ మల్టీ స్టారర్స్ వచ్చే కొద్దీ ఆడియెన్స్ అలాగే వారి హీరోల ఫ్యాన్స్ లో కూడా చాలా పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది.

దీనితో మరికొన్ని ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ ల కోసం మన స్టార్ హీరోల ఫ్యాన్స్ చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన మల్టీ స్టారర్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ లీడ్ వదిలారు. అయితే గతంలో వెంకీ మామతో ఓ సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

కాకపోతే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో భాగంగా కూడా తాను మల్టీ స్టారర్ సినిమా చెయ్యడానికి సిద్ధమే అని ఎవరితో అయినా చేస్తానని మహేష్ తెలిపారు. మంచి కథ దొరకాలి గాని తప్పకుండా మల్టీ స్టారర్ సినిమా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. మరి మహేష్ ని అయితే ఏ స్టార్ హీరోతో మల్టీ స్టారర్ లో మీరు చూడాలి అనుకుంటున్నారో ఈ కింది పోల్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

పోల్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :