సుధీర్ బాబు , అదితి రావ్ హైదరి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర్రం సమ్మోహనం. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ ను రాబ్బట్టుకుంటుంది . ఇక ఈ చిత్రాన్ని చూసిన మహేష్ బాబు సమ్మోహనం చిత్ర టీం ఫై ప్రశంసలు కురిపించారు . సమ్మోహనం కథను చక్కగా , అందంగా రాశారు ఇండస్ట్రీలో ప్రతిభ గల దర్శకుల్లో మోహన్ కృష్ణ ఒకరు ఈ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది . సుధీర్ బాబు , అతిధి అద్భుతంగా నటించారు వారి కెరీర్ లో ఇది ఉత్తమ ప్రదర్శనగా చెప్పవచ్చు . అలాగే నరేష్ గారి నటన అద్భుతం ఆయనో గొప్ప నటుడు అని మొత్తం చిత్ర బృందానికి మహేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు .
ఇక ఈ సినిమా అటు ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ సుధీర్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకపోతుంది . శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు .
