వావ్ : కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ పై … సూపర్ స్టార్ మహేష్ సూపర్ పోస్ట్ …. !!

Published on Jul 2, 2022 10:00 pm IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విక్రమ్ హిట్ లిస్ట్. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కమల్ హాసన్ ఎంతో భారీగా నిర్మించిన విక్రమ్, ఇటీవల పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి పెద్ద సక్సెస్ కొట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్ సొంతం చేసుకున్న విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కీ రోల్స్ చేసారు. ఇక ఈ మూవీపై కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, అటు సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు. లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్రమ్ మూవీపై తన స్పందనని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇవాళ కమల్ విక్రమ్ మూవీ చూసాను, నిజంగా ఈ న్యూ ఏజ్ థ్రిల్లర్ మూవీ అదిరిపోయింది. సినిమా చూసిన తరువాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఈ థ్రిల్లింగ్ మూవీ గురించి ఒకసారి కలిసి మాట్లాడాలనిపించింది. కీలక పాత్రలు చేసిన విజయ్ సేతుపతి, ఫాహద్ ఇద్దరూ కూడా తమ క్యారెక్టర్స్ లో అదరగొట్టారని, అనిరుద్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని, ఇక ఫైనల్ గా లెజెండ్ కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చెప్పేంతటి స్థాయి నాకు లేదు, ఆయనకు పెద్ద అభిమానిగా మరొక్కసారి స్క్రీన్ పై పెర్ఫార్మన్స్ కూడా ఎంతో ఎంజాయ్ చేశాను, ఇది నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ అంటూ తన పోస్ట్ లో విక్రమ్ మూవీ గురించి ప్రశంశలు కురిపించారు సూపర్ స్టార్. ప్రస్తుతం మహేష్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం :