“భీమ్లా నాయక్”పై ప్రశంసలు కురిపించిన మహేశ్ బాబు..!

Published on Feb 26, 2022 9:27 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ చిత్రంపై సినీ రంగానికి చెందిన పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా భీమ్లాపై ప్రశంసలు కురిపించారు. నిప్పులు కురిపించేలా పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రదర్శన ఉందని, డేనియల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి సంచలనం సృస్టించాడని మరియు అతడి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎంతో చక్కగా ఉందని అన్నాడు. త్రివిక్రమ్ రచన ఎప్పటిలాగే బ్రిలియంట్‌గా ఉందని, కె రవి చంద్రన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడని.. నాకు ఇష్టమైన లెన్స్‌మెన్లలో అతడు కూడా ఒకరని అన్నాడు. ఇక థమన్ అందించిన మ్యూజిక్ స్కోర్ కూడా అల్టీమేట్ అని, మిమ్మల్ని ఖచ్చితంగా మంత్రముగ్ధులను చేస్తుందని అన్నాడు. చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలియచేశాడు.

సంబంధిత సమాచారం :