ఆ భారీ సినిమా నిర్మాణంలో దిల్ రాజు.. నిజమెంత ?

Published on Oct 31, 2021 8:08 pm IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. . ఈ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాత. అయితే, ఇప్పుడు మరో నిర్మాత కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోబోతున్నారని ఇండస్ట్రీలో రూమర్ వినిపిస్తోంది. కేఎల్ నారాయణతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నారట.

ఈ చిత్రం.. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. భారీ బడ్జెట్ ఉంటుంది. అందుకే దిల్ రాజు కూడా పార్టనర్ గా జాయిన్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం రాజమౌళి అండ్ ఆయన టీమ్ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. రచయిత విజయేంద్రప్రసాద్‌ మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట.

ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశారట విజయేంద్రప్రసాద్‌.

సంబంధిత సమాచారం :