‘సర్కారు వారి పాట’కు మహేశ్ బాబు అంత తీసుకుంటున్నాడా?

Published on Sep 24, 2021 2:29 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

అయితే సర్కారు వారి పాట కోసం మహేశ్ బాబు భారీగా పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను చేసేందుకు మహేశ్ రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :