1058వ గుండెకి ప్రాణం పోసిన మహేష్ బాబు..!

Published on Jan 21, 2022 7:05 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలు తోనే బిజీగా ఉండడమే కాకుండా మరోపక్క పెద్దగా ఆర్భాటం లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. మరి అందులో భాగంగానే ఎందరో చిన్నారులకు ఊపిరి పోసి వారి పాలిట దైవం మానుష రూపేణ గా అయ్యాడు.

ఇప్పటి వరకు ఎందరో చిన్నారులు హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి తన ఆదాయం నుంచి ఆపరేషన్ లు చేయించి ప్రాణాలు నిలుపగా తాజాగా కాపాడిన ప్రాణంతో ఈ లెక్క ఒక వెయ్యి యాభై ఎనిమిది దగ్గరకి వచ్చింది. మరి ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన ఇన్స్టా గ్రామ్ ద్వారా తెలియజేశారు. దీనితో మహేష్ అభిమానులు మరింత గర్వం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :