మరొక బేబీ ప్రాణాలను కాపాడిన మహేష్..!

Published on Jul 18, 2021 6:16 pm IST

టాలివుడ్ ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక బేబీ బాయ్ ప్రాణాలను కాపాడారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఒక పోస్ట్ చేశారు. బేబి బాయ్ కి చాలా క్లిష్టమైన గుండె ఆపరేషన్ ను చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ బేబీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది అని అన్నారు. ఆ బేబీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం గా ఉండాలి అంటూ ప్రార్థించారు. మరొక ప్రాణాన్ని కాపాడిన ఆంధ్రా హాస్పిటల్స్ పై నమ్రత శిరోద్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి ప్రజలకు పలు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఈ విషయం బయటికి రావడం తో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు రియల్ హీరో అంటూ ప్రతి ఒక్కరూ చెప్పుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం :