మరొక చిన్నారి ప్రాణాలు కాపాడిన మహేష్..!

Published on Sep 21, 2021 8:32 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడుగా ఎంత ఎత్తుకి ఎదిగారో, అదే విధంగా సహాయం లోనూ ఎప్పుడు ముందుంటారు. ఎంతోమంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన మహేష్, ప్రస్తుతం మరొకసారి తన మానవత్వ హృదయాన్ని చాటుకున్నారు. 2 సంవత్సరాల వయస్సు ఉన్న అక్షయ అనే చిన్నపిల్ల కి ఆపరేషన్ కి మహేష్ సహాయం చేసినట్లు తెలుస్తోంది. మహేష్ భార్య నమ్రత అందుకు సంబంధించిన ఒక ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇందుకు సంబంధించిన విషయాన్ని వెల్లడించడం జరిగింది.

అక్షయ కి ప్రస్తుతం ఆపరేషన్ అయిపోయింది అని, కోలుకొని, డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఈ విధంగా సహాయం చేస్తున్న ఆంధ్రా హాస్పిటల్స్ కి మరొకసారి థాంక్స్ చెబుతూ, #mbforsavinghearts అంటూ హ్యష్ ట్యాగ్ ను జత చేశారు.

సంబంధిత సమాచారం :