రాజమౌళితో సినిమాపై సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చిన మహేష్.!

Published on May 10, 2022 7:05 pm IST


ఒక్క టాలీవుడ్ మాత్రమే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ల సినిమా అని చెప్పాలి. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ఎప్పుడు అయితే అనౌన్స్ అయ్యిందో దానిపై నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా మహేష్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది. రాజమౌళితో ఒక్క సినిమా గాని చేస్తే 25 సినిమాలు చేసినట్టే అని దానికి ఆలస్యం అయినా కూడా ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారని సెన్సేషనల్ స్టేట్మెంట్ అందించారు. దీనితో ఇది మంచి ఆసక్తిగా మారింది. మరి అలాగే ఈ చిత్రం మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేసాక స్టార్ట్ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :