వైరల్ : సితార లోని మరో టాలెంట్ ని పరిచయం చేసిన మహేష్.!

Published on Apr 10, 2022 1:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ మరియు స్టైలిష్ ఎంటెర్టైనెర్ నుంచి లాస్ట్ టైం వచ్చిన సాంగ్ “పెన్నీ”. థమన్ ఇచ్చిన ఈ క్రేజీ సింగిల్ కి గాను సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అంశం ఏదన్నా ఉంది అంటే అది మహేష్ కూతురు సితార చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ అని చెప్పాలి.

కానీ ఈరోజు ఈ పవిత్ర రామనవమికి గాను సితార లోని మరో టాలెంట్ ని పరిచయం చేస్తూ మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇందులో సితార తన ఫస్ట్ టైం కూచి పూడి నాట్య ప్రదర్శన చేసింది అని ఈరోజున ఈ అద్భుతమైన వీడియోని షేర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మహేష్ తెలిపారు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో మరియు మహేష్ అభిమానుల్లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :