పూరి జగన్ కి మహేష్ స్పెషల్ విషెస్..!

Published on Sep 28, 2021 1:06 pm IST

డైనమిక్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కి సినీ పరిశ్రమ నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, హీరోలు పూరి జగన్నాథ్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కి స్పెషల్ విషెస్ తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్, ఆనందం మరియు గొప్ప ఆరోగ్యం తో ఉండాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలకి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ గతం లో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో లైగర్ అంటూ పాన్ ఇండియా మూవీ ను తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :